మతసామరస్యానికి ప్రతీక మొహరం

  • డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

జైనూర్, ఆంధ్రప్రభ : మతసామరస్యానికి ప్రతీక మొహరం అని ఆసిఫాబాద్ డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మొహరం పండుగ పురస్కరించుకొని జై నూరు మండలంలోని పవర్ గూడ పంచాయతీ లో సందర్శించడంతో ఆమెకు సర్పంచ్ రాజేందర్ గ్రామస్తులు బ్యాండులతో స్వాగతం పలికారు. పవర్ గుడలోని పీరీలకు మహిళలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ప్రజలకు మొహరం పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

మండలంలో మొహరం పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి పీరీలను వాడ వాడలా ఊరేగించి ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపు కున్నారు, పీవీల ఊరేగింపులో యువకులు నృత్యాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా జరపగా ప్రజలు వీరిలకు పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు. గూడమామలో జరిగిన మొహరం వేడుకల్లో సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు పాల్గొని టీవీలకు ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు ఆ గ్రామంలో పీరీలను ఊరేగించగా వేడుకల్లో సర్పంచ్, పాల్గొన్నారు.