ఎస్ ఐఆర్ ఓటర్ సర్వే ను పరిశీలించిన సూపర్ వైజార్..
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని దిల్దార్‌నగర్ గ్రామంలో శుక్రవారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ బద్దెనపల్లి స్టీఫెన్, బీఎల్‌ఓ రుక్మిణి ఆధ్వర్యంలో సాగింది.
ఈ సందర్భంగా బీఎల్‌ఓ సూపర్‌వైజర్ గంగారాం గ్రామాన్ని సందర్శించి ఎస్‌ఐఆర్ ఓటరు సర్వే తీరును పరిశీలించారు. సర్వేను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించి, అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని బీఎల్‌ఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బద్దెనపల్లి స్టీఫెన్, బీఎల్‌ఓ రుక్మిణి, ఓటర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
