ప్రతి ఒక్కరూ ‘ఎస్ఐఆర్’లో పాల్గొనాలి

జులైవాడ (హన్మకొండ జిల్లా), ఆంధ్రప్రభ: రాబోయే ఎన్నికల ప్రక్రియలో భాగంగా చేపట్టే ‘ఎస్ ఐ ఆర్’ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తమ పూర్తి వివరాలను అధికారులకు అందజేయాలని బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు విజయ ప్రకాష్ రెడ్డి కోరారు.

శుక్రవారం హన్మకొండ జిల్లా జులైవాడ పరిధిలోని 50వ డివిజన్ దీన్ దయాల్ నగర్, పోస్టల్ కాలనీలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా బీఎల్ఓ మైముదాతో కలిసి విజయ ప్రకాష్ రెడ్డి ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు ఎస్ఐఆర్ పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఓటరు తమ పూర్తి సమాచారాన్ని ఎస్ఐఆర్ ఫారమ్‌లలో నింపి, సంబంధిత బీఎల్ఓలకు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. ఓటు అనేది అత్యంత విలువైందని, దాన్ని కాపాడుకోవాల్సిన కనీస బాధ్యత ప్రతి బాధ్యత గల పౌరుడిపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కృష్ణ, సంపత్ తదితరులు పాల్గొన్నారు.