పండ్ల తోటల పెంపకం చేసి ఆర్థిక అభివృద్ధి చెందాలి
- ఎంపీడీవో రవి ప్రసాద్
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వర్షాధా రిత కింద పండ్ల తోటల పెంపకం చేసి, ఆర్థిక అభివృద్ధి చెందాలని ఎంపీడీవో రవి ప్రసాద్ తెలిపారు. వర్షాధారిత పండ్ల తోటల పెంపకం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెద్ద కౌకుంట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని మైలారం పల్లిలో గురువారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల తోటల పెంపకం కింద, రైతు అంజినప్ప పొలంలో చీనీ చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ఎంపీడీవో రవి ప్రసాద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండ్ల తోటల పెంపకం కింద మామిడి, చీనీ, నిమ్మ, జామ, తైవాన్ జామ, సపోటా, చింత, కొబ్బరి, అల్లనేరేడు, అంజూర సీతాఫలం, దానిమ్మ, ఆపిల్ టేర్, ఆవకాడో, పనస, డ్రాగన్ ఫ్రూట్, గులాబీ, మల్లె, మునగ, ఉద్యాన పంటలకు పంటను బట్టి 100 శాతం ఉచితంగా రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తారని తెలిపారు. చిన్న సన్న కారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సుజాత, టీఏ విజయ్ తదితరులు పాల్గొన్నారు.
