తొర్రూరు డిపోను సుందర్శించిన డిప్యూటీ ఆర్ఎం..
తొర్రూరు, ఆంధ్రప్రభ : టీజీఎస్ ఆర్టీసీలో సాధారణ బదిలీల్లో భాగంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ ఆర్ఎం కిషన్ రావు గురువారం తొర్రూరు ఆర్టీసీ డిపోను సందర్శించారు.ఈ సందర్భంగా డిపో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినందుకు డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి,ఎంఎఫ్ విజయ్ కుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు. డిపో గ్యారేజ్ ఆవరణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి టైర్ మైలేజీని పెంచడమే కాకుండా గ్యారేజ్ సిబ్బంది తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించి డిపో అభివృద్ధికి సహకరించాలన్నారు.
గ్యారేజ్ సిబ్బందికి తగు సలహాలు సూచనలు ఇచ్చారు.డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి ఆధ్వర్యంలో డిపో ఆవరణంలో మొక్కను నాటారు.డిపో మేనేజర్ ప్రసన్న లక్ష్మి మాట్లాడుతూ గతంలో మాదిరిగానే రీజియన్ లో మొదటి స్తానంలో తొర్రూరు డిపోను నిలిపేందుకు ఉద్యోగులంతా తమ తమ విధులను సక్రమంగా నిర్వహించి డిపో భివృద్ధికి సహకరించలన్నారు.ఈ కార్యక్రమంలో ఏడీసీలు లు, మెకానికులు, శ్రామికులు, తదిరులు పాల్గొన్నారు.
