ఎస్ఐఆర్ ఓటర్ల సవరణ సర్వే ప్రారంభం..
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో గురువారం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ఓటర్ల జాబితా సవరణ సర్వే కార్యక్రమం ప్రారంభమైంది.
గూడమామడ గ్రామంలో నిర్వహించిన సర్వే కార్యక్రమంలో సర్పంచ్ కుమ్ర యశోద కేశవరావు పాల్గొని ప్రజలకు సర్వే పత్రాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సర్వే నిర్వహిస్తున్న బీఎల్వోలు, సూపర్వైజర్లతో కలిసి ప్రతి ఓటరు వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు. ఓటర్లు కూడా సర్వేకు సహకరించి తమ పూర్తి వివరాలను సక్రమంగా అందించాలని కోరారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎంతో కీలకమని పేర్కొంటూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అందరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు, బీఎల్వోలు, గ్రామ ప్రజలు, ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.
