ఎస్‌ఐఆర్–2026పై విస్తృత అవగాహన ప్రచారం..
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)–2026 కార్యక్రమంపై ఎల్కతుర్తి గ్రామంలో గురువారం అవగాహన ర్యాలీ, ప్రచార కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మునిగడప లావణ్య ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓటరు జాబితాలో పేరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించిన వివరాలను తెలియజేశారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామస్థులు కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు ప్రాముఖ్యతను వివరించారు. 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు.
గ్రామ ప్రజలు ఉత్సాహంగా పాల్గొని ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఓటరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటు హక్కు కీలకమని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు శీలం అనిల్, యువ నాయకులు గోడిశాల అర్జున్ గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు గోడిశాల వినయ్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్ (బక్కి), బీజేపీ నాయకుడు జనగాం కిష్టయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.
