మునుగోడు ఎంపీడీవోగా పి. వెంకటేశ్వర్ రెడ్డి..
మునుగోడు, ఆంధ్రప్రభ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో మండల పంచాయతీ అధికారిగా పనిచేసిన పి. వెంకటేశ్వర్ రెడ్డి పదోన్నతిపై నల్లగొండ జిల్లా మునుగోడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో)గా గురువారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా మండల కార్యాలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, సిబ్బంది ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదలకు తన వంతు కృషి చేస్తానని వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
