Ap-Cm-Cbn : గోదారి కావేరీ కలిపేద్దాం Andhra Prabha Top News
Ap-Cm-Cbn : గోదారి కావేరీ కలిపేద్దాం Andhra Prabha Top News
- నదుల అనుసంధానం అనివార్యం
- ఇది జరిగితే నాలుగు రాష్ట్రాలకు లాభం
- ఎల్ నినో ప్రభావంతో
- ఆల్మట్టి, తుంగభద్రకు నీళ్లు రావటం లేదు
- రాష్ట్రాలు వేరైనా.. మనది ఒకటే దేశం
- ప్రధాని మోదీ నాయకత్వంలో
- భారత్ వేగంగా పరిగెడుతోంది
- ముగ్గురు సీఎంల కలయిక చారిత్రాత్మం
- ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రతిపాదన
( ఆంధ్రప్రభ, హోస్ పేట)

గోదావరి- కావేరిని కూడా అనుసంధానించటం ద్వారా కర్ణాటక- ఏపీ, తమిళనాడు, తెలంగాణ ప్రయోజనాలు నెరవేరతాయి.. అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు 33 నూతన క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవ అనంతరం బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ,

1983లో ఉమ్మడి ఏపీ కర్ణాటక, మహారాష్ట్ర అంగీకారంతో చెన్నైకి 15 టీఎంసీల తాగునీటిని అందించాం . ఎల్ నినో కారణంగా తుంగభద్రకు, ఆల్మట్టికి ఎగువ నుంచి నీటి ప్రవాహాలు రావటం లేదు. ఈ ఏడాది చాలా పొదుపుగా నీటిని వాడుకోవాల్సి ఉంది. అందుకే నదుల అనుసంధానం చేస్తే ప్రయోజనం ఉంటుంది ముందుగా అంతర్గతంగా నదుల్ని అనుసంధానించుకుందాం. ఆ తర్వాత రాష్ట్రాల మధ్య నదుల అనుసంధానం చేసుకోవచ్చు. రాష్ట్రాలుగా మనం అంతా వేరైనా దేశంగా మనం అంతా ఒక్కటే. అని ఏపీ సీఎం వివరించారు.
Ap-Cm-Cbn : ఈ కలయిక చారిత్రాత్మకం

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఇవాళ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులం కలిసి ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలపై చర్చించాం
దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సమావేశం ఓ చరిత్రగా నిలిచిపోతుంది. మనం అంతా కలిసి రైతుల ప్రయోజనాలను కాపాడుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ వేగంగా అభివృద్ధిని అందుకుంటోంది. వన్ నేషన్ వన్ గ్రిడ్, టెలికామ్, రహదారి నెట్వర్క్ లాంటి వాటితో భారత్ ఒక విజయవంతమైన దేశం దేశంలో గంగా కావేరి నదుల్ని అనుసంధానిస్తే ఇండియా ఇక అన్ స్టాపబుల్ . కెన్ బెత్వా ప్రాజెక్టు ద్వారా యూపీ, మద్యప్రదేశ్‌లో నదుల్ని అనుసంధానించారు. అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Ap-Cm-Cbn : మూడు రాష్ట్రాలకు ప్రయోజనం

మూడు రాష్ట్రాల రైతులకు నీటిని, ఈ ప్రాంత వాసులకు తాగునీటిని అందిస్తోన్న తుంగభద్ర డ్యామ్ అభివృద్ధిలో కీలకం తుంగా పాణం, గంగా స్నానం అనే సామెత ఉంది. తుంగ నది నీరు అంత పవిత్రమైనది. 2024లో 19వ గేట్ కొట్టుకుపోతే దానికి స్టాప్‌లాక్ గేట్ అమర్చాం. ఇప్పుడు మళ్లీ 33 క్రస్ట్ గేట్లను పునరుద్ధరించాం. గేట్లను మార్చే విషయంలో ఏపీ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేశాయి. మళ్లీ తుంగభద్రా డ్యామ్‌ను పునరుద్ధరించి రైతుల ప్రయోజనాలు కాపాడాం 1983లో ప్రధానితో పాటు నలుగురు ముఖ్యమంత్రులు కలిసి తమిళనాడుకు 5 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు ఇప్పుడు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఏపీ, కర్ణాటక, తెలంగాణా ముఖ్యమంత్రులు కలవటం ఓ చారిత్రాత్మక అంశం గేట్ కొట్టుకుపోయినప్పుడు నిపుణుడు కన్నయ్య నాయుడు ద్వారా స్టాప్‌లాక్ గేట్ అమర్చి నీరు వృధా కాకుండా కాపాడాం, అని ఏపీ సీఎం హర్షం వ్యక్తం చేశారు.
