భారీ వర్షాలకు వంతెనకుపెద్ద బుంగ
- మరమ్మతులు చేయించాలి: సర్పంచ్ రాందాస్
జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జ0గాం సమీపంలోని రామ్ నాయక్ తండ, నందు నాయక్ తండ ఆశ పెళ్లి గ్రామపంచాయతీ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన ఆర్ అండ్ బి రోడ్డు వంతెనకు భారీ వర్షాల వల్ల వరద నీటికి పెద్ద బుంగ ఏర్పడింది. రామ్ నాయక్ తండా సర్పంచ్ రాథోడ్ రాందాస్ చిన్న వంతెనకు ఏర్పడ్డ పెద్ద బుంగను పరిశీలించారు. ఈ ప్రాంతాల వైపు ద్విచక్ర వాహనాలు పెద్ద వాహనాలు అధికంగా నడుస్తాయని ఏర్పడ్డ బుంగతో ప్రమాదం పొంచి ఉందని ఆర్ అండ్ బి అధికారులు మరమ్మతు పనులు చేయించాలని సర్పంచ్ రామదాసు కోరారు. వాన దారులు రాత్రి వేళల్లో గమనించకుంటే అందులో పడి ప్రమాదం జరిగే పరిస్థితులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
