డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుండాలి

  • ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

పరకాల, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణములో గల అన్నీ విద్య విద్యాసంస్థల విద్యార్థులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద మారక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ మరియు మానవహారం కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.యువత తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు. “డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం” అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమము లో పరకాల పోలీస్ ఇన్స్పెక్టర్ వి క్రాంతి కుమార్, ఎస్ఐ పి పవన్ మరియు పోలీస్ సిబ్బంది, పట్టణ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.