‘రావు బహదూర్’ కు మహేష్ ఫిదా.. ట్వీట్ వైరల్..!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘రావు బహదూర్’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సినిమాను చూసిన మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
“రావు బహదూర్… ఇది మిమ్మల్ని కాలర్ పట్టుకుని లాగే సినిమా మాత్రమే కాదు, మీ చర్మంలోకి చొచ్చుకుపోయే సినిమా కూడా. విచిత్రమైన, అందమైన, తీవ్రమైన నాటకీయతతో కూడిన అద్భుతమైన ప్రపంచాన్ని దర్శకుడు సృష్టించారు. సత్యదేవ్ తనదైన నటనతో ఆ ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నారు. దీపా థామస్ తన సూక్ష్మమైన నటనతో మెరిశారు. అద్భుతమైన నటీనటులు, అత్యుత్తమ సాంకేతిక బృందం సినిమాకు గొప్ప బలం అయ్యారు. చిత్ర బృందం మొత్తానికి గర్వంగా ఉంది” అని మహేష్ బాబు ట్వీట్ చేశారు.
అంతేకాకుండా, “జూలై 3 నుంచి వెండితెరపై రావు బహదూర్ , అతని ఉన్మాదాన్ని ప్రేక్షకులు చూడబోతున్నారు. అందరూ ఈ సినిమాను ఆస్వాదించాలని ఎదురుచూస్తున్నాను” అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబు చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆయన ప్రశంసలతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
