​మండోళ్లగూడెంలో ఓటర్ల నమోదుపై అవగాహన సదస్సు

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండల పరిధిలోని మండోళ్లగూడెం గ్రామంలో ఓటర్ల నమోదు, సవరణలపై బూత్ లెవల్ అధికారుల ఆధ్వర్యంలో గురువారం గ్రామ ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ​ఈ సందర్భంగా సర్పంచ్ తంగెళ్ల వెంకటేశం మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు. ఈ ​కార్యక్రమంలో వార్డు మెంబర్ గుండు శ్రీశైలం, బూత్ లెవల్ ఆఫీసర్లు (బిఎల్ఓ) మంగమ్మ, జయమ్మ లతో పాటు స్థానిక నాయకులు బాల్ రెడ్డి, అంజరెడ్డి, మోహనరెడ్డి, రామకృష్ణ, లింగస్వామి, సిరాజ్, ఫైయాజ్, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.