చౌటుప్పల్‌లో ఇంద్రమ్మ ఇంటి ప్రారంభోత్సవం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డులో నూతనంగా నిర్మించుకున్న ఇంద్రమ్మ ఇల్లు గురువారం ప్రారంభమైంది. వార్డుకు చెందిన లబ్ధిదారులు సరిపల్లి సౌజన్య – నరసింహ దంపతుల గృహప్రవేశం సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, స్థానిక కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ కుమార్ గౌడ్ హాజరై నూతన గృహాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి, మాజీ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, ఆలయ ధర్మకర్త వరకాల రవి గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు దొనకొండ కృష్ణ, కాంగ్రెస్ నాయకులు ఊదరి నరసింహ, సరిపల్లి మారయ్య, వార్డు అధికారులు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.