భీంగల్‌లో సబ్ కోర్టు ప్రారంభానికి సిద్ధం

  • కాంగ్రెస్ నాయకుల పరిశీలన

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన భీంగల్ సబ్ కోర్టు నిర్వహణ కోసం పట్టణంలోని ఐకేపీ భవనానికి చేపట్టిన మరమ్మత్తు పనులు పూర్తయ్యాయని, కోర్టు కార్యకలాపాలు ప్రారంభించేందుకు భవనం సిద్ధంగా ఉందని ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ధ్రువీకరించారు.

ఈ నేపథ్యంలో పూర్తయిన కోర్టు భవన సముదాయాన్ని భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఐకేపీ కార్యాలయ భవనానికి అదనపు మరమ్మత్తులు చేపట్టేందుకు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రూ.15 లక్షల నిధులను మంజూరు చేశారని భీంగల్ మండల మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ తెలిపారు.

ఈ సందర్భంగా భీంగల్‌కు సబ్ కోర్టు మంజూరు చేయడంలో, అలాగే భవన అభివృద్ధికి నిధులు సమకూర్చడంలో కృషి చేసిన రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి గాడి ప్రవీణ్ కుమార్‌కు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరె నాగమణి స్వామి, వైస్ చైర్మన్ జేజే లతా–జేజే నర్సయ్య, కౌన్సిలర్లు నాగేంద్ర, సంగ్యా నాయక్, సందీప్, అంజుమ్, మెండోరా సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్, వీడీసీ చైర్మన్ పాతని కృష్ణ, కాంగ్రెస్ నాయకులు సుంకరి సురేష్, మేకల శ్రీనివాస్, పల్లికొండ రాజేష్, రావుట్ల నవీన్, సామ్రాజ్, గంగారపు శ్రీకాంత్, చెప్పాల రాకేష్, పిట్ట మహేష్, బోదిరె విశాల్ తదితరులు పాల్గొన్నారు.