జిల్లాలో ఒలింపిక్ డే రన్-2026 నిర్వహణ..

ములుగు ప్రతినిధి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒలింపిక్ డే రన్-2026 కార్యక్రమాన్ని ములుగు జిల్లా ఒలింపిక్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు అనగా జూన్ 24, 2026 న ములుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ రూరల్ వాటర్ సప్లై మంత్రివర్యులు డా. ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే ఐఏఎస్, జిల్లా ఎస్ పి సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ఐపీఎస్ హాజరు అయ్యారు. జిల్లా ఒలింపిక్ డే రన్ కమిటీ కన్వీనర్ గా పగడాల వెంకటేశ్వర్ రెడ్డి ఉన్నారు. క్రీడాస్ఫూర్తి, ఆరోగ్యకర జీవన విధానాన్ని ప్రోత్సహించే ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..