ఇథనాల్ పై అపోహలను చెక్ !!
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల వెహికల్స్ ఇంజిన్లకు నష్టం జరుగుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ పూర్తిగా సైంటిఫిక్‌గా వాలిడేట్ అయిందని, నిరంతర మానిటరింగ్‌లో అమలవుతోందని పేర్కొంది. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌పై సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న కామెంట్స్ అసత్యాలు, ఆధారరహితమైనవని కేంద్రం కొట్టిపారేసింది. ప్రజలను మిస్‌లీడ్ చేయడానికే ఇలాంటి ప్రచారం జరుగుతోందని పేర్కొంది.
ఈ ప్రోగ్రామ్ అమలును ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఆటోమొబైల్ తయారీ సంస్థలు, ఫ్యూయల్ క్వాలిటీ టెస్టింగ్ ఏజెన్సీలు, ఇతర స్టేక్‌హోల్డర్లతో కలిసి ప్రభుత్వం నిరంతరం రివ్యూ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇథనాల్ బ్లెండింగ్ కారణంగా దేశవ్యాప్తంగా ఇంజిన్ ఫెయిల్యూర్స్ లేదా వెహికల్స్ బ్రేక్‌డౌన్ అయినట్లు పెద్ద ఎత్తున ఎలాంటి కంప్లైంట్స్ నమోదు కాలేదని స్పష్టం చేసింది.
ఫ్యూయల్ ఇంపోర్ట్స్‌పై ఆధారాన్ని తగ్గించడం, ఎన్విరాన్‌మెంట్ పరిరక్షణ, రైతులకు అదనపు ఇన్‌కమ్ కల్పించడం లక్ష్యంగా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్‌ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్ వినియోగం ద్వారా దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్ పొదుపుతో పాటు గ్రీన్ ఎనర్జీ వినియోగం పెరుగుతుందని, చెరకు రైతులు సహా వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని కేంద్రం తెలిపింది .
