డ్రగ్స్‌కు ‘నో’ చెప్పండి..

చిట్యాలలో పోలీసుల అవగాహన కార్యక్రమం

చిట్యాల, ఆంధ్రప్రభ: జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో మంగళవారం విద్యా ర్థులకు మాదకద్రవ్యాల దు ష్ప్రభావాలపై పోలీసులు అవగాహన సమావేశం ప్రిన్సిపల్ గోల్కొండ బిక్షపతి అధ్యక్షతన నిర్వ హించారు. కార్యక్రమంలో చిట్యాల ఎస్సై పోచంపల్లి సతీష్ మాట్లాడుతూ… విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాల ,డ్రగ్స్,, గంజాయి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.

వ్యసనాలకు లోనుకాకుండా క్రమశిక్ష ణతో కూడిన ఉన్నతమైన జీవితాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ వహిం చి ఉన్నత శిఖరాలను అధిరో హించాలని, డ్రగ్స్ వంటి మ హమ్మారులకు దూరంగా ఉం టూ అనే నినాదంతో శారీరక దృఢత్వం కోసం క్రీడలు, వ్యాయామాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వి ద్యార్థినులకు మాదకద్రవ్యాల నిర్మూలనపై వ్యాసరచన, పోటీలు నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో, అధ్యా పకులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.