KTR | వైభవ్‌పై కేటీఆర్ కామెంట్ వైరల్!

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ సరదా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నలకు కేటీఆర్ ఇచ్చిన సమాధానాల తీరు స్టైలిష్ బ్యాటర్‌ను గుర్తు చేస్తోందంటూ అక్కడ ఉన్న వారు ప్రశంసించారు. దీనికి స్పందించిన కేటీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

“స్టైలిష్ బ్యాటర్ అంటే వైభవ్ సూర్యవంశీ. నా వయస్సు 50 ఏళ్లు. 15 ఏళ్ల కుర్రాడితో నేను ఎలా పోల్చుకోగలను?” అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. కేటీఆర్ చెప్పిన మాటలు అక్కడున్న వారిని తెగ ఆకట్టుకోగా, సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారాయి.

క్రికెట్‌లో తన ప్రతిభతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న వైభవ్ సూర్యవంశీపై కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. యువత ప్రతిభను ప్రశంసిస్తూనే తనను వారితో పోల్చడం కంటే వారి విజయాలను గుర్తించడం మంచిదనే సందేశం ఆయన మాటల్లో కనిపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో కేటీఆర్ హాస్య చతురత, సమయోచిత స్పందన మరోసారి చర్చనీయాంశంగా మారింది.