3-dead-gunfight : కెనడాలో గన్ ఫైట్ Andhra Prabha Crime News
3-dead-gunfight : కెనడాలో గన్ ఫైట్ Andhra Prabha Crime News
- మగ్గురు దుర్మరణం
- ఓ పోలీసు అధికారి మృతి
- 24 ఏళ్ల కెనడా చరిత్రలోనే.. ఇదొక్ విషాదం
- అనుమానితుడు..మరో పౌరుడు మృతి
- మహిళ పోలీసు అధికారికి తీవ్ర గాయాలు
- ఉగ్రదాడా అనే కోణంలో దర్యాప్తు
- మాంట్రియల్ లో భీతావహం
- పోలీసులు హై అలెర్ట్
( ఆంధ్రప్రభ, మాంట్రియల్ ప్రతినిధి )
కెనడాలో ఓ దుండగుడు చెలరేగిపోయాడు. కాల్పులకు తెగబడ్డాడు. ప్రతిగా పోలీసులు కూడా ఎదురు దాడికి దిగారు. ఈ ఎన్ కౌంటర్ లో కెనడా పాతికేళ్ల చరిత్రలోనే తొలిపారిగా ఓ పోలీసు అధికారి దుర్మరణం చెండాడు. మరో మహిళ పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు కూడా మృతి చెండాడు. కాల్పులు జరిపిన దుండగుడ్ని పోలీసులు మట్టుబెట్టారు. కాగా.. ఈ ఘటన యూదులపై ద్వేషంతో జరిగిందా? లేక ఉగ్ర దాడా? అనే అంశంపై కెనడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో ఒక్క సారిగా కెనడాలోని ప్రముఖ మాంట్రియల్ నగరంలో బీతావహం సృష్టించింది. పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఈ దారుణ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
3-dead-gunfight : మాంట్రియల్ లో… గన్ ఫైట్
కెనడా కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం మాంట్రియల్‌లోని కోట్-డెస్-నీజెస్ ప్రాంతంలోని ఒక హోటల్ కిటికీ గుండా లాంగ్-రేంజ్ గన్ (లాంగ్ గన్) బయటకు కనిపిస్తోందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకోగానే, మిలిటరీ తరహా దుస్తులు ధరించిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. పోలీసులు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒక పోలీస్ అధికారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మాంట్రియల్ నగరంలో విధి నిర్వహణలో ఒక పోలీస్ అధికారి మరణించడం గత 24 ఏళ్లలో ఇదే మొదటిసారి అని పోలీస్ చీఫ్ ఫాడీ డాగర్ తెలిపారు.ఈ కాల్పుల ఒక పోలీస్ అధికారి, ఒక పౌరుడు , అనుమానిత నిందితుడు మరణించారు. మరో మహిళా పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. రు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ప్రాణాపాయం తప్పిందని అధికారులు నిర్ధారించారు.
3-dead-gunfight పోలీసులు హైఅలర్డ్
మాంట్రియల్ నగరంలో హై-అలర్ట్ ప్రకటించారు. ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితుడి వద్ద ప్రమాదకర ఆయుధాలు ఉండటంతో ప్రభుత్వం మొబైల్ అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది, ప్రజలందరినీ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ఆదేశించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ప్రాంతంలోని రహదారులను, డెకారీ ఎక్స్‌ప్రెస్‌వే హైవేను స్థానిక మెట్రో సేవలను కొన్ని గంటల పాటు పూర్తిగా నిలిపివేశారు. నిందితుడు మరణించినట్లు నిర్ధారించుకున్నాక మధ్యాహ్నం తర్వాత లాక్‌డౌన్ ఎత్తివేశారు. దా ఈ కాల్పులు జరిగిన కోట్-డెస్-నీజెస్ ప్రాంతంలో యూదుల జనాభా ఎక్కువ. అక్కడ అనేక సినగాగ్‌లు (యూదుల ప్రార్థనా మందిరాలు), కోషర్ మార్కెట్లు ఉన్నాయి. ఈ దాడి యూదులను లక్ష్యంగా చేసుకుని జరిగిందా (ద్వేషపూరిత నేరమా) లేదా ఉగ్రవాద చర్యనా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోందిఈ దాడి పట్ల కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, మరణించిన అధికారి కుటుంబానికి సంతాపం ప్రకటించారు
