ఓటరు జాబితాపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి

  • బీఎల్‌ఏలకు కీలక శిక్షణ

జోగులాంబ గద్వాల జిల్లా, ఆంధ్రప్రభ: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రాంప్రసాద్ బ్యాన్కెట్ హాల్‌లో గద్వాల, ధరూర్, కె.టి.దొడ్డి, గట్టు, మల్దకల్ మండలాలకు చెందిన బీఎల్‌ఎలకు ప్రత్యేక సమగ్ర సవరణపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి అర్హుడైన ఓటరికి న్యాయం జరిగేలా సమగ్రంగా పని చేయాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యువజన కాంగ్రెస్ నాయకులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సెల్ సభ్యులు, సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, తాలూకా మండల స్థాయి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.