స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..

జైనూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో స్వర్ణకారుల బతుకులు దిగజారుతున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణకారుల కొరకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో జైనూర్ మండలస్వర్ణకారుల సంఘం నాయకులు సోమవారం కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ తాహ సిల్దార్ ఆడ బిర్షావ్ కు ఆ సంఘం అధ్యక్షులు నర్సింగోజు మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నరేందర్ నాయకులు వినతి పత్రం సమర్పించారు.

ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 272 సవరణ చేసి స్వర్ణకారులు దొంగ బంగారం రికవరీ నుండి కాపాడాలని, 50 సంవత్సరాలు దాటిన స్వర్ణకారుల వృత్తి చేస్తున్న వారికి గీత, నేత కార్మికులకు ఇస్తున్న 5000 పింఛన్ ప్రకారం స్వర్ణకారులవృత్తు దారులకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని వారు ఇచ్చిన వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ మాట్లాడుతూ తమ డిమాండ్లను ప్రభుత్వానికి పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.