రైతులు వరి ధాన్యాన్ని దళారులకు అమ్మొద్దు
రైతులు వరి ధాన్యాన్ని దళారులకు అమ్మొద్దు
- ఖానాపూర్ ఏఎంసీ భూషణ్
కడెం, ఆంధ్రప్రభ : రైతులు తమ వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మి లాభాలు పొందాలని ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్ సూచించారు.
శుక్రవారం కడెం మండలంలోని అంబారిపేట్, పాండవపూర్, నవాబ్‌పేట్ గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐకెపి ఏపీఎం జి. గంగాధర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సతీష్ రెడ్డి, గ్రామాల సర్పంచులు టి. రమేష్, ఆడే విజయ, ఉత్తర్ జుట్టు శంకరయ్య, యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు రెంకల శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ రెంకల విజయ్ మధుకర్, పంచాయతీ కార్యదర్శి మమత, నరసయ్య, ఐకెపి సీసీలు మల్యాల స్వామి, జ్యోతి, జాడి నరసయ్య, విష్ణువర్ధన్, అకౌంటెంట్ లింగన్న, మాజీ సర్పంచ్ రెంకల రాజన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్కల్ల సత్తన్న, జీపీ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
