BJP | మోదీ పాలన విజయాలపై చర్చ

BJP | మోదీ పాలన విజయాలపై చర్చ

BJP | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనకు 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ‘విశేష సంపర్క్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ భేటీ జరిగింది.

కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, దేశ ప్రగతికి సంబంధించిన అంశాలను ప్రముఖులకు వివరించే కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టింది. ఇందులో భాగంగా సినీ, వ్యాపార, సామాజిక రంగాలకు చెందిన ప్రముఖులను కలిసి మోదీ ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఈ క్రమంలో చిరంజీవిని కలిసిన రామచందర్‌రావు, దేశ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. విశేష సంపర్క్ అభియాన్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖులతో సమావేశాలు కొనసాగనున్నాయని బీజేపీ నేతలు పేర్కొన్నారు.