ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు కృషి

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు కృషి

  • ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం

చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, పారిశుద్ధ్యం, పరిరక్షణకు ప్రాతన్యత ఇస్తుందని ప్రభుత్వ విప్ వేముల వీరేశం తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం చిట్యాలలో వనమహోత్సవం,మరియు రూ.20 లక్షల వ్యయంతో అస్పిరేషనల్ టాయిలెట్‌ నిర్మాణంకు ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు.

వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే వేముల వీరేశం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ప్రజలకు సూచించారు.

భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించాలంటే పచ్చదనం పెంపు అత్యంత అవసరం. ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాలను ప్రజలు అందరూ కలిసి విజయవంతం చేయాలి” అని ఎమ్మెల్యే వీరేశం అన్నారు.సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, పారిశుద్ధ్యం మరియు పచ్చదనం పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోంది. చిట్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా, సుందరంగా తీర్చిద్దేందుకు మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి అని వీరేశం పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కమిషనర్ యు. గురులింగం, మున్సిపల్ చైర్మన్ పందిరి గీత రమేష్ రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.