గోడౌన్లను తనిఖీ చేసిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్లను సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించారు. తనిఖీల్లో భాగంగా నిల్వలకు సంబంధించిన రికార్డులు, భద్రతా ఏర్పాట్లు, నిర్వహణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అలాగే గోడౌన్లో ఉన్న నిల్వల రిజిస్టర్ను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను తెలుసుకున్నారు. గిడ్డంగుల నిర్వహణలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
