10:00pm 17జూన్2026 ముఖ్యాంశాలు
10:00pm 17జూన్2026 ముఖ్యాంశాలు
🔹 జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలు, పెట్టుబడులపై సానుకూల చర్చలు జరిగాయని ట్రంప్ పేర్కొంటూ, అమెరికాలో భారత్ పెడుతున్న పెట్టుబడులను ప్రశంసించారు.
———————————————–
🔹 ఫ్రాన్స్‌లోని జీ7 సదస్సులో ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం, హోర్ముజ్ జలసంధి భద్రత, ఎబోలా వ్యాప్తి ప్రధాన అంశాలుగా చర్చకు వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ సహకారం పెరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
———————————————–
🔹 జీ7 సదస్సులో ప్రధాని మోదీతో భేటీ అనంతరం భారత్‌పై ఏదైనా బాహ్య దాడి జరిగితే అమెరికా సహాయం అందిస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. హోర్ముజ్ జలసంధి భద్రత విషయంలో భారత్-అమెరికా సమన్వయం కొనసాగుతోందని తెలిపారు.
———————————————–
🔹 ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడని నాయకుడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. పశ్చిమాసియాలో భారత్ ప్రభావం, అంతర్జాతీయ వేదికలపై భారత పాత్ర మరింత పెరుగుతుందని ఆయన అన్నారు.
———————————————–
🔹 లక్నోలో జరిగిన రెండో వన్డేలో భారత్ 170 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్‌ను ఓడించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో రాణించగా, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలో మూడు వికెట్లు తీశారు.
పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
