జిల్లా కలెక్టర్‌కు ట్రెసా జిల్లా సంఘం శుభాకాంక్షలు

రేగొండ, ఆంధ్రప్రభ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను ఆయన కార్యాలయంలో జిల్లా ట్రెసా సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ట్రెసా జిల్లా సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధికి, ప్రజా సేవలకు ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో ట్రెసా జిల్లా అధ్యక్షుడు మార్క రామ్మోహన్, జిల్లా కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ రజాక్, ట్రెజరర్ పకిడే రాజయ్యతో పాటు రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.