విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ
మునుగోడు, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ప్రభుత్వ ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం అందజేసిన పుస్తకాలను గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహగౌడ్ విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. సకాలంలో పాఠ్యపుస్తకాలు అందడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తల్లమల్ల మల్లేశం, ప్రధానోపాధ్యాయులు బాలప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
