AP POLICE | అదనపు ఎస్పీలు, డీసీపీల బదిలీలు

AP POLICE | అదనపు ఎస్పీలు, డీసీపీల బదిలీలు

కొత్త పోస్టింగ్‌లతో పరిపాలన బలోపేతం

AP POLICE | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక స్థాయిలో ఉన్న అధికారుల బదిలీలు, కొత్త నియామకాలు చేపట్టింది. ఈ మేరకు పలువురు అదనపు ఎస్పీలు, డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), నాన్-కేడర్ ఎస్పీలకు కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

పోలీసు శాఖలో పరిపాలనా సామర్థ్యాన్ని మరింత మెరుగుపర్చే లక్ష్యంతో ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పలు జిల్లాలు, కమిషనరేట్లలో సేవలందిస్తున్న అధికారులను కొత్త స్థానాలకు బదిలీ చేయడంతో పాటు ఖాళీగా ఉన్న కీలక పోస్టులకు నియామకాలు చేపట్టారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఈ బదిలీలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త బాధ్యతలు చేపట్టనున్న అధికారులు త్వరలో తమ పోస్టింగ్ కేంద్రాల్లో విధుల్లో చేరనున్నారు.

కొత్త పోస్టింగ్‌ల జాబితా ఇదే..

ఏవీఆర్ పీబీ ప్రసాద్ – విజయవాడ టెక్నికల్ వింగ్ డీసీపీ

జి. స్వరూపరాణి – ఈగల్ ఎస్పీ (నాన్-కేడర్)

మహేంద్ర మాధే – కోనసీమ అదనపు ఎస్పీ (అడ్మిన్)

ఎస్. ఖాదర్ భాషా – నంద్యాల అదనపు ఎస్పీ (అడ్మిన్)

ఎల్. సుధాకర్ – బాపట్ల అదనపు ఎస్పీ (అడ్మిన్)

కె. రవి మనోహరాచారి – చిత్తూరు అదనపు ఎస్పీ (అడ్మిన్)

షాన్ షేక్ – చిత్తూరు అదనపు ఎస్పీ (ఓపీఎస్)

కేఎస్. వినోద్ కుమార్ – ఆర్టీసీ విజిలెన్స్ అదనపు ఎస్పీ

వై. ప్రసాదరావు – ఏలూరు అదనపు ఎస్పీ

ఎం. శ్రావణి – విజిలెన్స్ అదనపు ఎస్పీ

ఎ. కిషోర్ కుమార్ – కాకినాడ అదనపు ఎస్పీ (అడ్మిన్)

వై. శృతి – అల్లూరి జిల్లా అదనపు ఎస్పీ

ఆర్. రాఘవేంద్ర – విశాఖపట్నం ట్రాఫిక్ డీసీపీ

ఎల్. ఆజయ్ ప్రసాద్ – సీఐడీ ఎస్పీ (నాన్-కేడర్)

జేవీ సంతోశ్ – ఏసీబీ ఎస్పీ (నాన్-కేడర్)

జి. రామకృష్ణ – విజయవాడ ట్రాఫిక్ డీసీపీ