శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా పాఠశాల ప్రారంభోత్సవం
శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా పాఠశాల ప్రారంభోత్సవం
ఉట్నూర్, (ఆంధ్రప్రభ): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని బీర్సాయిపేట్ గ్రామాన్ని బుధవారం శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, పార్టీ నాయకులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పాఠశాలను చిన్న జీయర్ స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, ఉట్నూర్ ఐటీడీఏ ఏవో దామోదర్ స్వామి, నాయకులు, ప్రజలు చిన్న జీయర్ స్వామి నుంచి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉట్నూర్ మండల అధ్యక్షుడు బింగి వెంకటేష్, ఉట్నూర్ పట్టణ అధ్యక్షుడు తన్నీరు సతీష్, ఓబీసీ కన్వీనర్ సిపతి లింగాగౌడ్, సంజీవరెడ్డి, బీర్సాయిపేట్ బూత్ అధ్యక్షుడు రాజన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.
