Kesamudram | అల్లుడి హత్య కలకలం..

Kesamudram | అల్లుడి హత్య కలకలం..

  • అత్తమామలే హంతకులా?.. ఉప్పరపల్లిలో దారుణం
  • హత్యకు దారితీసిన కుటుంబ గొడవలు..
  • హత్య కారణాలపై దర్యాప్తు ప్రారంభం
  • ఘటనతో భయాందోళనకు గురైన గ్రామస్తులు

కేసముద్రం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కేసముద్రం (Kesamudram ) మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన సోమవారం రాత్రి కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తమామలే అల్లుడిని హత్య చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుండె నరేష్ (35) సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడ్డాడు. భార్యతో పాటు అత్తమామలు ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు. హత్యకు గల కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళన వాతావరణం నెలకొంది. మృతుడు నరేష్‌కు ఇద్దరు కుమారులు ఉన్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.