Bihar Accident Viral |ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదు..!
Bihar Accident Viral |ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదు..!
Bihar Accident Viral |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రోజురోజుకు సమాజంలో మానవత్వం తగ్గిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలతో పోరాడుతున్నాసాయం చేయాల్సింది పోయి, రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మామిడి పండ్ల కోసం జనం ఎగబడ్డ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు పశ్చిమ బెంగాల్ నుంచి మామిడి పండ్ల లోడుతో ఓ వాహనం వెళ్తుండగా గాయఘాట్ సమీపంలో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
అయితే గాయపడిన వ్యక్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు సహాయం చేయకుండా, వాహనంలో ఉన్న మామిడి పండ్లు, పెట్టెలను తీసుకోవడంలోనే ఎక్కువ మంది ఆసక్తి చూపినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.
వాహనంలో అజయ్ పాస్వాన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం అనంతరం వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ పాస్వాన్ మృతి చెందినట్లు తెలుస్తోంది.
Bihar Accident Viral |‘మానవత్వం ఎక్కడ?’ అంటూ నెటిజన్ల ఆగ్రహం
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రమాద సమయంలో బాధితులకు తక్షణ సహాయం అందించాల్సింది పోయి ఇలా ప్రవర్తించడం దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నారు. పండ్ల కంటే మనిషి ప్రాణానికి ఎక్కువ విలువ ఇవ్వాలని, కనీస మానవత్వం కూడా లేకపోవడం ఆందోళనకరమని విమర్శిస్తున్నారు.
click here to read more : మద్యం బాటిళ్ల కంటే మనిషి ప్రాణం చవకైపోయిందా?
