బీడీ కార్మిక విద్యార్థులకు దరఖాస్తుల ఆహ్వానం..
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : బీసీ కులాలకు చెందిన విద్యార్థులు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని భీంగల్ బీసీ వెల్ఫేర్ డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డా. ఎస్. శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన విద్యార్థులు ప్రీ మెట్రిక్ (1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), పోస్ట్ మెట్రిక్ (11వ తరగతి నుంచి డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సుల వరకు) స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల దరఖాస్తుల చివరి తేదీ ఆగస్టు 31, 2026 కాగా, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల దరఖాస్తుల చివరి తేదీ అక్టోబర్ 31, 2026 అని తెలిపారు.
విద్యార్థులు National Scholarship Portal ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వ స్కాలర్షిప్లను పొందాలని డా. శ్రీకాంత్ కోరారు.
