2 : 00 P.M. | ముఖ్యాంశాలు
🔹 కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డులు, కొత్త బొగ్గు గనుల కేటాయింపుపై హెచ్‌ఎంఎస్‌తో కలిసి ఉద్యమం చేపడతామని ప్రకటించారు.
——————————————
🔹 తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి సోదరి నమ్రత అదృశ్యం కేసులో ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేయగా, బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
———————————————-
🔹 చిత్తూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీటిలో మునిగిపోతున్న కుమారుడిని కాపాడేందుకు వెళ్లిన తల్లి కూడా మునిగి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
———————————————-
🔹 యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా మరోసారి వాయిదా పడే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. 2027 సంక్రాంతి విడుదలపై వార్తలు అభిమానుల్లో చర్చకు దారితీశాయి.
———————————————-
🔹 రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై మంత్రి టీజీ భరత్ విజిలెన్స్ విచారణ కోరారు. రూసా నిధులు, కాన్వొకేషన్ ఖర్చులు, భూముల ఆక్రమణలపై దర్యాప్తు కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.
———————————————-
🔹 తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. గౌతమి అన్నాడీఎంకేకు రాజీనామా చేయగా, విజయ్ పార్టీ, అన్నామలై, లత రజినీకాంత్ రాజకీయ అడుగులపై ఆసక్తి పెరిగింది.
———————————————-
🔹 వేసవి సెలవుల చివరి ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ వెల్లువెత్తింది. ఒక్కరోజే 62,967 మంది కనకదుర్గమ్మను దర్శించుకోగా, 10,208 మంది అన్నదాన ప్రసాదం స్వీకరించారు.
———————————————-
🔹 సినిమా అవకాశాల పేరుతో వేధింపులు చేశాడంటూ ఓ నటి క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై ఫిర్యాదు చేయగా, బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
———————————————-
🔹 విద్యాసంస్థల బస్సులపై ఆర్టీఏ ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, 150 బస్సులపై కేసులు నమోదు చేసింది. ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న 35 బస్సులను సీజ్ చేసింది.
———————————————-
🔹 అక్కినేని అఖిల్ ‘లెనిన్’ సినిమా మరోసారి వాయిదా పడి జూలై 10కు వాయిదా పడగా, వరుస పోస్టుపోన్‌లపై సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ సెటైర్లు పేలుస్తున్నారు.
పై ముఖ్యాంశాల్లోని పూర్తి వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
