ఓటరుగా తన బాధ్యత నిర్వర్తించిన దేవినేని అవినాష్

ఓటరుగా తన బాధ్యత నిర్వర్తించిన దేవినేని అవినాష్

సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారమ్ స్వీకరణ

విజయవాడ, ఆంధ్రప్రభ : ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా సోమవారం ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ వారి కుటుంబ సభ్యులకు సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ బూత్ లెవల్ ఏజెంట్ ఎన్యూమరేషన్ ఫారమ్‌లను అందజేశారు. ఈ సందర్భంగా ఓటరుగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ దేవినేని అవినాష్ ఎన్యూమరేషన్ ఫారమ్‌ను స్వీకరించారు, అవినాష్ మాట్లాడుతూ ప్రతి అర్హ ఓటరు సర్ ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియను ప్రజలు బాధ్యతగా తీసుకుని,తమ వివరాలను సరిచూసుకుని అవసరమైన సమాచారాన్ని నిర్ణీత గడువులోగా సమర్పించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని బూత్‌లలో ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభమైందని అవినాష్ తెలిపారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవడం, ఎవరి ఓటు హక్కు కోల్పోకుండా అప్రమత్తంగా ఉండటం ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగమని ఆయన పేర్కొన్నారు. పార్టీ శ్రేణులు, బీఎల్‌ఏలు ప్రజలు అందరూ సర్ ప్రక్రియపై పూర్తి అవగాహనతో వ్యవహరించి, ఓటరు హక్కుల పరిరక్షణకు సహకరించాలని దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు.