Vijay Divorce Case | విజయ్ కుటుంబంలో రాజీ కుదరనుందా?
Vijay Divorce Case | విజయ్ కుటుంబంలో రాజీ కుదరనుందా?
Vijay Divorce Case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీతకు సంబంధించిన విడాకుల పిటిషన్ విచారణ చెంగల్పట్టు మహిళా కోర్టులో సోమవారం జరిగింది. కేసు తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 7కు వాయిదా వేసింది.
ఈ వ్యవహారానికి సంబంధించిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టగా, తదుపరి విచారణ తేదీని నిర్ణయించింది. ఇదిలా ఉండగా, విజయ్ కుటుంబ సభ్యుల జోక్యంతో దంపతుల మధ్య రాజీ కుదిరే అవకాశాలపై తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ముఖ్యంగా విజయ్ తల్లి ప్రయత్నాలతో వీరిద్దరూ మళ్లీ కలిసే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంపై కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. విజయ్ అభిమానులు మాత్రం ఈ దంపతులు విభేదాలను పక్కనబెట్టి తిరిగి కలవాలని, కుటుంబంతో ఆనందంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నారు.
