Emotional post | విజయ్ దేవరకొండ భావోద్వేగ పోస్ట్.. !
Emotional post | విజయ్ దేవరకొండ భావోద్వేగ పోస్ట్.. !
Emotional post | స్కాలర్‌షిప్ కార్యక్రమం తొలి ఏడాది విజయవంతం
2027లో మరింత విస్తృతంగా చేపట్టనున్న సేవా కార్యక్రమం
Emotional post | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: విద్యార్థుల చదువుకు అండగా నిలిచేందుకు విజయ్ చేపట్టిన స్కాలర్‌షిప్ కార్యక్రమం తొలి సంవత్సరం విజయవంతంగా పూర్తైంది. ఈ కార్యక్రమంలో భాగంగా 45 పాఠశాలలకు చెందిన 180 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా విజయ్ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. “మరో మంచి రోజు. 45 పాఠశాలలకు చెందిన 180 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించిన తొలి సంవత్సరం పూర్తైంది. 2027 జూన్‌లో మళ్లీ మీ అందరినీ కలుసుకోవాలని ఎదురుచూస్తున్నాను. అప్పటికి ఈ కార్యక్రమాన్ని మరింత పెద్ద స్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తాను” అని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింత విస్తరించనున్నట్లు విజయ్ తెలిపారు. ఆయన చేపట్టిన ఈ సేవా కార్యక్రమంపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
CLICK HERE TO READ Maheshbabu Next Movie | బుచ్చిబాబు ఒక్క మాటతో టాలీవుడ్‌లో మొదలైన కొత్త చర్చ!
