మార్కండేయ ఆలయంలో మోదీ పేరిట ప్రత్యేక పూజలు..
మార్కండేయ ఆలయంలో మోదీ పేరిట ప్రత్యేక పూజలు..
దేశంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా మోదీ రికార్డు
హసన్‌పర్తి, (ఆంధ్రప్రభ): దేశంలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలు అందించిన ప్రధానిగా ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారని బీజేపీ రాష్ట్ర నాయకులు, హసన్‌పర్తి 66వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ అన్నారు.
హసన్‌పర్తి మండల కేంద్రంలోని మార్కండేయ స్వామి ఆలయంలో మండల బీజేపీ అధ్యక్షులు మారం తిరుపతి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ప్రధాని మోదీ పేరుతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ అధికారంలో 4,399 రోజులు పూర్తి చేసుకున్న మోదీ, తొలి సాధారణ ఎన్నికల తర్వాత సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును దాటేశారని పేర్కొన్నారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం నిరంతరాయంగా సేవలందించిన ప్రధానిగా మోదీ నిలిచారని తెలిపారు.
మండల బీజేపీ అధ్యక్షులు మాట్లాడుతూ మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచల నమ్మకానికి ఈ మైలురాయి నిదర్శనమని కొనియాడారు. మోదీ పాలనలో దేశం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిదాయక ప్రస్థానం భావితరాలకు బలమైన ప్రజాస్వామ్యంపై ఆశను, నూతన విశ్వాసాన్ని నింపుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మారపల్లి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, బీజేపీ నాయకులు దాసరి రాజు, జీల సురేష్ యాదవ్, చకిలం రాజేశ్వరరావు, మట్టెడ సుమన్, శీలం బిక్షపతి, ఆర్మీ శ్రీనివాస్, కోయడ రాజు, కుంబార్కర్ సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
