Balakrishna Birthday | క్యాన్సర్ ఆసుపత్రిలో చిన్నారుల సమక్షంలో కేక్ క‌టింగ్‌

Balakrishna Birthday | క్యాన్సర్ ఆసుపత్రిలో చిన్నారుల సమక్షంలో కేక్ క‌టింగ్‌

Balakrishna Birthday | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సినీ నటుడు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను ప్రతి ఏటా ఆసుపత్రిలోని క్యాన్సర్ రోగులైన చిన్నారుల సమక్షంలో జరుపుకుంటారు. ఆసుపత్రిలో క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులకు నైతిక స్థైర్యాన్ని అందించడానికి, వారి మధ్యలో ఉండి ఆయన కేక్ కట్ చేసే ఆనవాయితీ.ఈ ఏడాది కూడా బుధ‌వారం చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి, వారికి బహుమతులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తేవాలన్న తన తండ్రి నందమూరి తారక రామారావు ఆశయాలను బాలకృష్ణ గుర్తుచేసుకున్నారు.