Indrakeeladri | కనకదుర్గమ్మ కు కానుకుల వర్షం…

Indrakeeladri | కనకదుర్గమ్మ కు కానుకుల వర్షం…

  • అమ్మవారి కి రూ.3.41 కోట్లకు పైగా కానుకలు
  • భారీ గా 16 రోజుల హుండీ ఆదాయం
  • 273 గ్రాముల బంగారం, 4.450 కిలోల వెండి సమర్పణ..
  • దేశ విదేశాల భక్తుల విరాళాలతో ఇంద్రకీలాద్రికి ఆదరణ
  • లెక్కింపును పర్యవేక్షించిన దుర్గ గుడి చైర్మన్ బొర్రా గాంధీ ఈఓ శీనా నాయక్.

ఆంధ్రప్రభ ఇంద్రకీలాద్రి : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో భక్తులు సమర్పించిన కానుకలు భారీగా నమోదయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరవ అంతస్తులో జరిగిన ఈ కార్యక్రమాన్ని దేవస్థాన పాలకమండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో కె.ఎస్. శివనాయక్ ఆధ్వర్యంలో దేవస్థానం సిబ్బంది సేవకులు నిర్వహించారు.

లెక్కింపు వివరాలు ఇలా…

గత హుండీ లెక్కింపు (మే 18) నుంచి జూన్ 3 వరకు మొత్తం 16 రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ.3,41,39,565 నగదు ఆదాయం లభించింది. ఇందులో కరెన్సీ నోట్ల రూపంలో రూ.3,25,86,565, నాణేల రూపంలో రూ.15,53,000 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

రోజువారీ సగటు హుండీ ఆదాయం రూ.21.33 లక్షలుగా నమోదైంది. హుండీలలో భక్తులు 273 గ్రాముల బంగారం, 4 కిలోల 450 గ్రాముల వెండిని సమర్పించారు. విదేశీ భక్తుల నుంచి కూడా గణనీయంగా కానుకలు అందాయి. అమెరికా డాలర్లు, యూఏఈ దిర్హామ్స్, కెనడా డాలర్లు, సింగపూర్ డాలర్లు, బహ్రెయిన్ దినార్లు, ఖతార్ రియాల్స్, ఇంగ్లాండ్ పౌండ్లు తదితర విదేశీ కరెన్సీలు హుండీలలో లభించాయి.

దేశ విదేశాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో హుండీ ఆదాయం కూడా స్థిరంగా వృద్ధి చెందుతోందని దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తుల విశ్వాసం, అమ్మవారిపై ఉన్న అపార భక్తికి ఈ ఆదాయం నిదర్శనమని పేర్కొన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన అధికారులు, సిబ్బంది, భక్త స్వచ్ఛంద సేవకులు పాల్గొని లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. హుండీ ద్వారా లభిస్తున్న ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి, భక్తులకు మరిన్ని సౌకర్యాల కల్పనకు వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply