Eluru-Car-Crash : కారు బీభత్సం Andhra Prabha Crime News

Eluru-Car-Crash : కారు బీభత్సం Andhra Prabha Crime News

  • తృటిలో తప్పిన పెను ప్రమాదం
  • ఏలూరు లో కలకలం

( ఆంధ్రప్రభ, ఏలూరు)

Eluru-Car-Crash : ఏలూరులొ ఆదివారం రాత్రి పెనుప్రమాదం తప్పింది, ఓ కారు జనం మీదకు దూసుకు పోగా.. కారును డ్రైవరే అదుపులోకి తెచ్చుకున్నాడు. అతడు గాయపడ్డాడు. కానీ అతడు తాగి కారు నడపటం వల్లే ఈ ఘోరం జరిగింది. ఏ మాత్రం నిఫాలో .. అతడే అదుపు తప్పితే.. పరిస్థితి ఎంత ఘోరమో వర్ణనాతీతం. అసలు ఏం జరిగిందంటే.. ఏలూరులోని టూ టౌన్ పరిధిలో డిమార్ట్ సమీపంలో ఒక కారు ఆదివారం రాత్రి అదుపుతప్పింది, ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులపైకి దూసుకు పోతున్న తరుణంలో.. రోడ్డు పక్కనే షాపుల్లోకి కారు దూసుకుపోయింది. దుకాణాల ముందు గట్టును ఢీకొని కారు ఆగింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు అంటున్నారు.కారు డ్రైవర్ కు గాయాలు కావడంతో ఆసుపత్రి తరలించారు.

Leave a Reply