కుంరం నాగోరావ్ సేవలు ఆదివాసీ సమాజానికి మార్గదర్శకం

కుంరం నాగోరావ్ సేవలు ఆదివాసీ సమాజానికి మార్గదర్శకం

ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లాఉట్నూర్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హాల్లో ఏటూరునగరం ఐటీడీఏ ఏపీవో జనరల్ గా పనిచేస పదవి విరమణ పొందిన కుంరం నాగోరావ్ రమణమ్మ దంపతులకు పదవి విరమణ సన్మాన సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిర్మల్ డిసిసి అధ్యక్షులు,ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరై పదవి విరమణ పొందిన ఏపీవో నాగోరావ్ దంపతులకు శాలువతో ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కుంరం నగోరావ్ సేవలు చిరస్మరణీయం అని,నేను పిసా కోఆర్డినేటర్ గా ఆదివాసీ విద్యార్థి సంఘం లో ఉద్యమాలు చేసిన సమయంలో నాగోరావ్ ప్రోత్సాహం ఉండేదని వారికి నాకు చాలా మంచి అనుబంధం ఉందని,ఈ ప్రాంతంలో వారు పనిచేసినప్పుడు ఏజెన్సీ ప్రాంత ప్రజలకు వారు ఎంతో ఉపయోగకరంగా ఉన్నారని ఎమ్మెల్యే అన్నారు.

ఉద్యమ సమయంలోనూ యువతకు అండగా నిలిచారని, రిటైర్మెంట్ తర్వాత కూడా వారి సేవలు అలాగే ఉండాలని సమాజంలో గుర్తింపు పొందిన వ్యక్తిగా నేటి యువతకు నాయకులకు, నాగోరావ్ ఈ ప్రాంతం పట్ల అవగాహన,అనుభవం ఉన్నందున వారి సలహా సూచనలు అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో అదిలాబాద్ మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఉట్నూర్ ఐటిడిఏ పివిటిజిఎపిఓ ఆత్రం భాస్కర్, రిటైర్డ్ ఈఈ రాథోడ్ భీమ్రావు, ఆరోగ్యాధికారి రాయి రాయి సిడం చిత్రు, ఉద్యోగులు ఆదివాసి, ఉద్యోగ రాజకీయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘ నాయకులు, కుటుంబసభ్యులు,ఐటీడీఏ అధికారులు, ఉద్యోగులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Leave a Reply