Ram Charan | ఫ్యాన్స్ మధ్య ‘పెద్ది’..

Ram Charan | ఫ్యాన్స్ మధ్య ‘పెద్ది’..

  • ప్రసాద్స్‌లో సందడి చేసిన మెగా హీరో

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సినిమాతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. తాజాగా అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చాడు. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌కు సడన్‌గా చేరుకున్న చరణ్.. అభిమానులతో కలిసి థియేటర్‌లో సినిమా వీక్షిస్తూ ‘పెద్ది’ మాస్ రాంపేజ్‌ను ప్రత్యక్షంగా ఆస్వాదించాడు.

రామ్ చరణ్ థియేటర్‌కు వచ్చిన విషయం తెలియగానే అభిమానులు ఒక్కసారిగా ఉత్సాహంతో నిండిపోయారు. చరణ్‌ను చూసిన అభిమానులు హర్షధ్వానాలు చేస్తూ థియేటర్‌ను మార్మోగించారు. సినిమా ప్రదర్శన సమయంలో అభిమానుల స్పందనను గమనించిన చరణ్.. పలుమార్లు వారికి అభివాదం చేస్తూ ఆనందాన్ని పంచుకున్నాడు.

ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా రామ్ చరణ్‌తో కలిసి థియేటర్‌కు వచ్చాడు. అభిమానుల మధ్య కూర్చొని ఇద్దరూ సినిమా వీక్షించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ఎలివేషన్ సీన్లు, మాస్ ఎపిసోడ్స్‌కు ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్‌ను చూసి చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ‘పెద్ది’.. థియేటర్లలో అభిమానుల జోష్‌తో మరింత హైప్‌ను సొంతం చేసుకుంటోంది. రామ్ చరణ్, బుచ్చిబాబు థియేటర్ విజిట్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply