Pub Raid | అబ్బాయిల‌ను ర‌ప్పించేందుకు అమ్మాయిలతో చాటింగ్

Pub Raid | అబ్బాయిల‌ను ర‌ప్పించేందుకు అమ్మాయిలతో చాటింగ్

కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌పై పోలీసుల దాడి

Pub Raid | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలో ఉన్న KPHB కాలనీలోని కింగ్స్ అండ్ క్వీన్స్ (Kings and Queens) పబ్‌పై పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అర్థరాత్రి వరకు పబ్ నిర్వహిస్తుండటంతో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ (DCP R. Rithiraj) స్వయంగా ఈ దాడులకు నాయకత్వం వహించారు. డీసీపీ రితిరాజ్ ఎలాంటి సెక్యూరిటీ లేకుండా, సామాన్య కస్టమర్‌లా అర్ధరాత్రి పబ్‌లోకి ఒంటరిగా వెళ్లి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను స్వయంగా గుర్తించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్ యాజమాన్యం అమ్మాయిలతో చాటింగ్ చేయించి, యువకులను పబ్‌కు రప్పిస్తున్నట్లు తేలింది. పర్మిషన్ లేకపోయినా డాన్స్ ఫ్లోర్ ఏర్పాటు చేసి, అర్ధరాత్రి దాటినా గానా బజానా, హంగామా చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న పబ్ మేనేజర్‌తో సహా 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి పబ్‌ను కొనసాగిస్తున్న తీరుపై తీవ్ర డీసీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply