ప్లాస్టిక్ రహిత గ్రామంగా కమలాపూర్ ను తీర్చిదిద్దుదాం..
ప్లాస్టిక్ రహిత గ్రామంగా కమలాపూర్ ను తీర్చిదిద్దుదాం..
- గ్రామంలోని ప్రజలకు అవగాహన..
- పాల్గొన్న గ్రామ సర్పంచ్ వెంకట్రామ్
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామపంచాయతీలో బుధవారం ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ కార్యదర్శి శశికాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్పంచ్ వెంకటరామ్ పాల్గొని గ్రామస్థులకు వస్త్ర సంచులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల భూమి, నీరు, జీవవైవిధ్యానికి తీవ్ర నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు. ప్రజలు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని మానుకుని జ్యూట్, వస్త్ర సంచులను ఉపయోగించాలని సూచించారు.nకమలాపూర్‌ను ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు గ్రామస్థులందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
