పోటాపోటీగా ఫ్లెక్సీలు
పోటాపోటీగా ఫ్లెక్సీలు
వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు
వికారాబాద్ జూన్ 3 (ఆంధ్రప్రభ): ఈనెల నాలుగో తేదీన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జన్మదినము సందర్భంగా వికారాబాద్ జిల్లా కేంద్రంలోని పలు ప్రధాన మార్గాల్లో ఫ్లెక్సీల తో నిండిపోయాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అభివృద్ధి విషయంలో పోటీ పడాల్సిన నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు విషయంలో పోటాపోటీ పడడం పలువురుని ఆశ్చర్యపరుస్తుంది. అధికారంలో ఉన్నవారు అధికారంలో లేనివారు ఫ్లెక్సీలు ఏర్పాటుపై శ్రద్ధ కనపరచడం ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం పట్ల పలు విమర్శలకు తావిస్తుంది.
