అమరుల త్యాగాల వల్లే తెలంగాణ సాధ్యం
అమరుల త్యాగాల వల్లే తెలంగాణ సాధ్యం
భీమ్‌గల్ మండలంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండలంలోని 27 గ్రామ పంచాయతీలలో సర్పంచ్‌లు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం పంచాయతీ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై సీహెచ్. తిరుపతి, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
వ్యవసాయ శాఖ ఏవో కార్యాలయం వద్ద ఇన్‌చార్జ్ ఏవో లావణ్య, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద డాక్టర్ అజయ్ పవర్, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద ఎంఈవో డి. స్వామి జాతీయ పతాకాలను ఎగురవేశారు. అలాగే ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద అంగన్‌వాడీ టీచర్లు జెండాలను ఆవిష్కరించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించి, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ.. అమరుల త్యాగాలు మరువలేనివని, వారి త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో వివిధ శాఖల అధికారులు, గ్రామాల సర్పంచ్‌లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
