పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీఎల్ టీజర్ సందడి..
- ఏపీఎల్ టీజర్ ను ప్రారంభించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
- ఏపీఎల్ టీం కెప్టెన్స్ కు శుభాకాంక్షలు తెలిపిన మెగా పవర్ స్టార్
- టీజర్ లో ప్రత్యేక ఆకర్షణ గా పెద్ది షాట్
- టీం కెప్టెన్స్ ను రామ్ చరణ్ కు పరిచయం చేసిన ఏసిఏ అధ్యక్షుడు కేశినేని శివనాధ్
ఆంధ్రప్రభ విజయవాడ : ఆంధ్రప్రదేశ్ క్రికెట్ చరిత్రలో మరో విశిష్ట ఘట్టానికి తెరలేపుతూ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఏపీఎల్-2026 అధికారిక టీజర్ ఘనంగా విడుదలైంది. “పెద్ది” ప్రీ-రిలీజ్ వేడుక వేదికగా జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాధ్ (చిన్ని) ప్రత్యేక చొరవ తీసుకోగా, ఏపీఎల్-2026లో పాల్గొంటున్న ఏడు జట్ల కెప్టెన్లు కూడా వేదికపై హాజరై టీజర్ విడుదలలో భాగస్వాములయ్యారు. ఈ సందర్బంగా సినీ వైభవం, క్రికెట్ ఉత్సాహం ఒకే వేదికపై కలిసిన ఈ అరుదైన ఘట్టం అభిమానులను ఉర్రూతలూగించింది. టీజర్ విడుదలతో ఏపీఎల్-2026పై అంచనాలు మరింత పెరిగాయని, రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.
“సినిమా గ్లామర్ – క్రికెట్ జోష్ కలిసిన వేళ, ఏపీఎల్-2026కు అద్భుత శ్రీకారం!” అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.మూడు నగరాల్లో అట్టహాసంగా ఏపీఎల్-2026 జరగనుంది క్రీడలతో పాటు సంస్కృతి, పర్యాటకానికి ఊతంక్రికెట్ వికేంద్రీకరణే లక్ష్యం అధ్యక్షుడు కేశినేని శివనాథ్ అన్నారు ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధిని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ముందుకు సాగుతోందని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026ను కేవలం క్రికెట్ టోర్నమెంట్‌గా కాకుండా క్రీడలు, సంస్కృతి, వినోదం, పర్యాటకం, ఆర్థికాభివృద్ధి కలిసిన సమగ్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
