ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మక్తల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఘనంగా జరిగాయి. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పి.రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానసా హనుమంతు, మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా లక్ష్మారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీడీవో రమేష్ ఆవిష్కరించారు.

అదేవిధంగా తహశీల్దార్ కార్యాలయం వద్ద తహశీల్దార్ సతీష్ కుమార్ జాతీయ పథకాలు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బి .రాజశేఖర్ రెడ్డి ,కౌన్సిలర్లు మహేష్, వెంకటేష్, పీకే నరసింహ, కృష్ణ, కోళ్ళ సంధ్య వెంకటేష్, చెన్నమ్మ,అనిత , రహీం పటేల్ ,ఎరుకలి శంకరమ్మ, నహీదా బేగం, మున్సిపల్ కమిషనర్ రాజయ్య, వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్,పారేవుల విష్ణువర్థన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్,ఫయాజ్ ,సాలంబిన్ ఉమర్ బస్రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply